హుస్నాబాద్,జనత న్యూస్: పొట్లపల్లిలో ఈత,తాటి చెట్లు కాలిపోయి ఉపాధి కొల్పోయిన గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అదూకోవాలని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సూచించారు.సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొప్లపల్లి ఇటీవల కూలిపోయిన ఈత,తాటి చెట్లను బండి సంజయ్ సందర్శించి గీత కార్మికులు, స్థానికులను కలిసి తాటి చెట్ల దగ్దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గౌడన్నలు ప్రమాదవ శాత్తు చనిపోతే పైసలివ్వడం కాదు..బతికున్నప్పుడు ప్రభుత్వం ఆదూకుని ఉపాధి కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్లు కాలిపోతే గీత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.మద్యం షాపులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం..తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గీత కార్మికుల పొట్ట కొడుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని? అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిన ఒక్కటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా? ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తానన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా?. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు.?.. ఏమైంది? అధికారంలోకి వచ్చినంక అటకెక్కించారన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలంటూ గీత కార్మికులకు పిలుపునిచ్చారు.
Bandi Sanjay: కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించిన బండి సంజయ్
- Advertisment -