మద్యాపానంలో.. టాప్‌లో తెలుగు రాష్ట్రాలు
జనత :
భారత్‌లో మద్యాపాన నిషేదం నుండి నెంబవర్ వన్, టు..స్థానాలకు ఎదిగాయి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు. 1995 జూన్ 1న అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మద్యాపాన నిషేదం అమల్లోకి తీసుక వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసింది. క్రమ క్రమంగా మద్యం ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం టాప్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం విశేషం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ( సీఎంఐఈ) కన్స్యూమర్ పిరమిడ్ హౌస్‌హోల్డ్ సర్వే నిర్వహించగా..తెలంగాణలో మద్యాపానానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు తేలిందట. తెలంగాణలోని సగటున ఒక కుటుంబం మద్యం కొనుగోలు కోసం రూ. 1623 ఖర్చు చేస్తుండగా, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రూ. 1306 ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో తేలినట్లు సీఎంఐఈ పేర్కొంది. అతి తక్కువగా మద్యాపానానికి సగటున ఒక కుటుంబం ఉత్తరప్రదేశ్‌లో రూ. 49 ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలిచిందట. ఆ తర్వాత మొదటి ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ రూ. 140, త్రిపుర రూ. 148, మధ్యప్రదేశ్ రూ. 197, అస్సాం రూ. 198 చొప్పున ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు తేలింది.
నిషేదం నుండి.. నెం.1, 2 వరకు..
- Advertisment -