Bagavath Kesari: బాలకృష్ణ నటించిన లేటేస్ట్ మూవీ భగవంత్ కేసరి. బాలయ్య కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా సెంటిమెంట్ చిత్రాలను కూడా పండించగలడనీ ఈ మూవీతో తెలుస్తోంది. సెంటిమెంట్ నేపథ్యంలో థియేటర్లో సండి చేస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగానే వస్తోంది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే 90 కోట్లను దాటేసినట్లు సమాచారం. బాలకృష్ణ, కాజల్ లతో పాటు శ్రీలీల నటించిన ఈ మూవీపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్డేట్ ను అందించారు. ఈ సినిమాలో ఇప్పుడున్న వాటితో మరో సాంగ్ ను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
బాలకృష్ణ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ‘మంగమ్మ గారి మనువడు’. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులో ‘దంచవే మేనత్త కూతురా?’ అనే సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ పాటకు రీమిక్స్ లు ఎన్నో వచ్చాయి. అయితే ఈ సాంగ్ ను ‘భగవంత్ కేసరి’లో ముందే పెట్టాలని నిర్ణయించారు.కానీ ఇప్పుడున్న వాటిని ఇది డామినేట్ చేస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు కొత్తగా యాడ్ చేస్తున్నట్లు సోమవారం జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.