విజయవాడ, జనతా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నెహ్రూ బస్టాండ్ లో ఘోరం జరిగింది. ప్లాట్ ఫాం పైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కింద పడి ముగ్గురు అక్కడికక్కడమే మరణించారు.మరణించిన వారిలో కండక్టర్, ఓ మహిళ, బాలుడు ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. విజయవాడలోని ఆటోనగర్ కు చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు ప్లాట్ ఫాంపైకి వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ రివర్స్ గేర్ వేయాల్సిందిపోయి ఫస్ట్ గేర్ వేశాడు. దీంతో బస్సు ఫ్టాట్ ఫాంపైకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్టాండ్ లోని 11,12 ప్లాట్ ఫాం ఫిల్లర్లు ధ్వంసం అయ్యాయి.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోరం..
- Advertisment -