విజయవాడ, జనతా న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి తాను ఎన్నికల బరిలో దిగబోతున్న పిఠాపురంలో పర్యటనకు సిద్ధమయ్యారు. మార్చి 30 నుంచి మూడు రోజుల పాటు జనసేన పిఠాపురంలో పర్యటించబోతున్నారు. ముందుగా పరుహూతిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తన పర్యటనలో భాగంగా తొలిరోజు బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.