Sunday, July 6, 2025

కమలం పార్టీకి ఆయుధమవుతున్న అయోధ్య..!

  • 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీయే టార్గెట్..!
  • 2019 కన్న అదనంగా 10 శాతం ఓట్ల కోసం ఎత్తులు
  • రాముడి పేరుతో ఇండియా కూటమిని చిత్తు చేసేలా స్కెచ్ లు
  • రామాలయ నిర్మాణం కోసం ఇప్పటికే..
  • సంఘ్ పరివార్ శక్తుల విస్తృత ప్రచారం
  • దేేశమంతా ఇంటింటికి అక్షింతల పేరుతో భాజపాకు కొత్త ఊపు
  • ఎంపిక చేయబడ్డ లోక్ సభ సెగ్మెంట్ల నుంచి..
  • 2 కోట్ల మందిని అయోధ్యకు రప్పించేలా ప్రణాళికలు
  • లోక్ సభ ఎన్నికల నాటికి రామాలయ నిర్మాణ ఘనతను..
  • ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి లబ్ధిపొందేలా ప్రణాళికలు

జనతా న్యూస్,హైదరాబాద్:బీజేపీకి అయోధ్య రామాలయ నిర్మాణం రాజకీయంగా కలిసోస్తుంది. రామ్ లల్లాతో ఆ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరుగుతోంది. నార్త్ ఇండియాలోనైతే భాజపా మైలేజ్ అమాంతం పెరిగిపోతోంది. రామాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు జరిగిన ప్రచారం,జరుగుతున్న క్యాంపెయిన్ కమలం పార్టీకి పొలిటికల్ గా మరింత సానుకూల పవనాలను ఏర్పరచింది. దేేశ వ్యాప్తంగా ఇంటింటికి రాముల వారి అక్షింతల పేరు తో జరిగిన కార్యక్రమాలు కూడా బీజేపీకి మంచి పాజిటివ్ వేవ్స్ ను క్రియేట్ చేసి పెట్టాయి. ఇక 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటు బీజేపీ కూడా అయోధ్య రాములొరి రాజకీయ కార్డును ఉపయోగించుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లుతుంది.

ఇందుకోసం ఆపార్టీ జాతీయ నాయకత్వం కూడా ఇప్పటికే అన్ని రాష్ట్ర శాఖలకు అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కోసం పార్టీ తరపున చేసిన ప్రయత్నాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాక ఎంపిక చేయబడ్డ లోక్ సభ సెగ్మెంట్ల నుంచి సుమారు 2 కోట్లకు తగ్గకుండా అయోధ్యను సందర్శించేలా పార్టీ క్యాడర్ ద్వారా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేసిన కృషి ఏంటో ప్రజలకు వివరించి పొలిటికల్ మైలేజ్ ను పెంచుకుంటోంది. మామూలుగా ప్రతీ ముస్లిం జీవితంలో ఒక్కసారైన మక్కాను సందర్శించాలని భావిస్తుంటారు. అందుకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం వారికి హజ్ యాత్రకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే వీరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఉచిత హజ్ యాత్రకు అవకాశం కల్పించినట్లే..అయోధ్యకు వెళ్లే హైందవ సోదరులకు కూడా రాయితీలు ఇవ్వబోతున్నట్లు బీజేపీ చెబుతోంది. ఇందుకు సంబంధించిన క్యాంపెయిన్ ను కూడా ఆపార్టీ క్యాడర్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లుతుంది. దీంతో మెజార్టీ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడి అది కాస్తా ఓటు బ్యాంకుగా మారే ఛాన్సెస్ మెండుగా కనిపిస్తున్నాయి.

మెజార్టీ సీట్లే టార్గెట్..!

2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 303 సీట్లను గెలుచుకుంది. దాదాపు 37.4 శాతం ఓట్లను సాాధించింది. ఎన్డీయే కూటమి 45 శాతం రాబట్టింది. కానీ,ఈసారి బీజేపీ కేంద్ర నాయకత్వం 2019 ఎన్నికల కన్న అదనంగా మరో 10 శాతం ఓట్లను తెచ్చుకోవాలని ఆలోచన చేస్తోంది. దేశ వ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో సుమారు 50 శాతం ఓట్లను సాధించగల్గితే సునాయాసంగా నాలుగు వందలకు పై చిలుకు లోక్ సభ స్థానాలను కైవశం చేసుకోవచ్చని అనుకుంటోంది. తద్వారా జాతీయ స్థాయిలో మళ్లీ బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించేందుకు అవకాశముంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈస్థాయి మెజార్టీ సీట్లను గెలుచుకునేందుకు ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే పని పెట్టుకుంది భాజపా.

1990 ఏడాది సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో ఏల్.కే అద్వానీ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రామ్ రథ యాత్రను చేపట్టారు. దీనికి జాతీయ స్థాయిలో విశేషమైన మద్దతు దొరికింది. 1980లో బీజేపీ పార్టీ ఏర్పడిన తర్వాత 1989-1990 వరకు ఆపార్టీకి పబ్లిక్ లో పెద్దగా సపోర్ట్ దొరకలేదు. కానీ,1990లో అద్వానీ చేసిన యాత్ర వల్లే అయోధ్య రాముడి అంశాన్ని ఆపార్టీ ఓన్ చేసుకోగల్గింది. నార్త్ ఇండియా లోనైతే ఈ యాత్ర వల్లే ఆపార్టీ క్రమంగా లోక్ సభలో తమ బలాన్ని పెంచుకోగల్గింది. ఇక ఇప్పుడు ఏకంగా అయోధ్యలో ఈనెల 22న రాముడి ఆలయ నిర్మాణమే జరగబోతోంది. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఆపార్టీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని సీట్లను తెచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలో చిచ్చుపెట్టిన రాముడు..!

మరోవైపు ఇండియా కూటమిలో రాములొరి చిచ్చు మొదలుపెట్టడంలో బీజేపీ దాదాపు సక్సెస్ అయింది. ఈనెల 22న అయోధ్యలో ప్రారంభమవుతున్న రాముల వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి రావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకు దేవాలయ ట్రస్ట్ తరపున లేఖలు వెళ్లాయి. అయితేే అన్ని పార్టీలకు లేఖలు వెళ్లినప్పటికీ..జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ గా ఏర్పాటైన ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందించడం గమనార్హం. కాంగ్రెస్ నుంచైతే అయోధ్య కార్యక్రమానికి హాజరవుతుంది..లేనిది అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయంలో ఆపార్టీ కేవలం దాటవేత ధోరణిని అవలంభిస్తూ..రక రకాల స్టేట్ మెంట్లు ఇస్తోంది. ఇక జేడీయూ మాత్రం తాము వెళ్తామనే సంకేతాలను ఇప్పటికే పంపింది. మరోవైపు ఆర్జేడీ మాత్రం ఈ కార్యక్రమానికి తాము వెళ్లేదే లేదని తేల్చి చెప్పింది. ఎస్పీ అధినేత అఖిలేఖ్ యాదవ్ ఈ విషయంలో నోరు విప్పకపోగా.. ఆయన సతీమణీ డింపుల్ మాత్రం అక్కడికి వెళ్లడం ఇష్టమేనని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఇండియా కూటమిలోని పార్టీలు అయోధ్య రామాలయం విషయంలో వ్యవహరిస్తున్న తీరు కాస్తా బీజేపీకి పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టినట్లైంది. ఎటోచ్చి అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ అంశం 2024 లోక్ సభ ఎన్నికల నాటికి భాజపాకు ఒక వజ్రాయుధంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page