Thursday, March 12, 2026

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

కరీంనగర్, జనతాన్యూస్:విద్యార్థులు చదువులో హీరోయిజం చూపించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని ముక్రాంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన) లో స్నేహిత కార్యక్రమం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిగా చదువుతేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఎవరి నుంచైనా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డ, అన్యాయానికి గురైనా విద్యార్థులు అధికారులకు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కాచెల్లెలు, తల్లిదండ్రులను గౌరవించాలని పేర్కొన్నారు.

విద్యార్థులు మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని, తద్వారా సమాజంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, తప్పులు చేసే ఛాన్స్ ఇవ్వవద్దని పేర్కొన్నారు. సెల్ ఫోన్లను ఎక్కువగా వాడవద్దని, అవసరం ఉన్న సమయంలోనే ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులు ఆపద సమయంలో 1098కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు, మార్కెటింగ్ అధికారి పద్మావతి, సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత, పాఠశాల హెచ్ఎం ఎస్కే చాంద్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఉన్నత పాఠశాల (పురాతన) లో ఉన్న మ్యూజియాన్ని ఆధునీకరించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అధికారులకు సూచించారు. శుక్రవారం మ్యూజియం భవనాన్ని పరిశీలించారు. పురాతనైన మ్యూజియం భవనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు తగిన అంచనాలను రూపొందించాలని, దీంతో నిధులు మంజూరు చేస్తానని అధికారులను ఆదేశించారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page