జగిత్యాల, జనతా న్యూస్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు స్పందించి అంబు లెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షత గాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తు న్నారు. సంఘటనలో గాయపడ్డ వారంతా మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు..
కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా..
- Advertisment -