జనతా న్యూస్ బెజ్జంకి : అసెంబ్లి ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు సాగాయి. మానకొండూరు నియోజకవర్గం లోని బెజ్జంకి మండలానికి చెందిన వడ్లూరి బేగంపేట్ ఎంపీటీసీ భర్త, బీఆర్ఎస్ యువజన నాయకుడు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ,మానకొండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తన అనుచరులతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు.
గత ఎన్నికలలో బిఆర్ఎస్ గెలిచినప్పటికీ, బేగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు మెజార్టీ లభించిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా బీర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో బేగంపేట గ్రామాన్ని మండలంగా ప్రకటించి రద్దు చేయడంతో పాటు సిద్దిపేట జిల్లాలో కలిపారని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేవారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బేగంపేట గ్రామాన్ని మండలంగా కలిపి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ రావడంతో కాంగ్రెస్ పార్టీలో జాయిణ అయినట్లు వారు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు రేవంత్ రెడ్డి చరిస్మ మొదలైన విషయాలు రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే విషయాలుగా బెజ్జంకి మండల ప్రజలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగం శంకర్, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, సోమ రాంరెడ్డి, శీలం నరసయ్య, బుర్ర అంజయ్య, బుర్ర తిరుపతి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ ( సీనియర్ కాంగ్రెస్ నాయకుడు) మామిడాల జయరాం, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కొరివి లక్ష్మణ్, కొరివి కనకయ్య, పత్తి మహేందర్ రెడ్డి, పురుషోత్తం అంజయ్య, కొరివి అజయ్, గుల్ల శ్రీను, కొరివి సంతోష్, కొరివి తిరుపతి, బుర్ర రాకేష్, బుర్ర హరీష్, బుర్ర సురేష్, ఎల హరీష్ పున్నమి రాజేశం, శ్రీరామోజు కిషన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.