Thursday, September 11, 2025

ఎట్టకేలకు రేవంతే సీఎం..

ఎస్. వి రమణాచారి, సీనియర్ జర్నలిస్టు

  • సంప్రదాయ ప్రకారం కీచులాటలు

  • చివరకు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం….

  • బూర్గుల రామకృష్ణా రావు తర్వాత మహబూబ్ నగర్ జిల్లా వాసికి సీఎంగా అవకాశం

ప్రజలు తీర్పు ఇచ్చినా సీఎం సీటు కోసం నాయకుల మధ్య కుస్తీలు. చివరివరకూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ట్విస్టులు…చివరికి అనుముల రెవెంత్ రెడ్డి ని సీఎం గా ప్రకటించటంతో కధ సుకాంతం కావటంతో యావత్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆనంద భరితంగా ఉత్సవాలు చేసుకున్నారు…దీంతో తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత రెండో సీఎం గా అనుముల రేవంత్ రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే పదవి రాకముందే రేవంత్ చేసిన ట్వీట్ పలు వర్గాలలో సంచలనం సృష్టించింది.తుఫాన్ ప్రభావంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ రేవంత్ అధికార వర్గాలకు చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ట్వీట్ తో అటు అధికార వర్గాలు,ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహా జర్నలిస్టులు సైతం విస్తు బోయారు.ఇదే సమయంలో రేవంత్ అభిమానులు సీఎం రేవంత్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వూరేగింపులు చేయటంతో రేవంత్ వ్యతి రేకవర్గీయులు బెంబేలెత్తారు…

అధిష్టానం పిలుపుతో మంగళవారం సాయంత్రం ఫ్రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎక్కటంతో ఇక రేవంత్ రెడ్డి తెలంగాణాకు రెండో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారన్న గ్యారెంటీ లభించింది.ఈ నెల 7న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట 2వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్భంగా మా మానేరు జనత పత్రిక శుభాకాంక్షలు తెలుపుతున్నది.

ఇదీ రేవంత్ ప్రస్థానం..

1969 నవంబర్ 8 న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూర్ మండలం కొండా రెడ్డి పల్లి లోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రేవంత్ రెడ్డి.తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి రామ చంద్రమ్మ. చిన్ననాటినుంచే రాజకీయాలంటే ఆసక్తి చూపే రేవంత్ రెడ్డి తన చదువు కొనసాగించడం కోసం ఇంటర్ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఏవీ కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఏబీవీపీ కార్యకర్త గా పని చేస్తూ రాజకీయాలపై మంచి అవగాహన పెంపోందుంచుకున్నారు…ఈ దశలోనే పెయింటర్ గా పని చేస్తూ జీవన భృతి కోసం కొట్టు మిట్టాడారు.అంతే కాకుండా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతుర్ని 1992లో ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు….
ఇలా జీవన ప్రస్థానం సాగుతుండగా..మొదటినుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న రేవంత్ 2004 లో టీడీపీ కార్యకర్తగా చేరారు…2006లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జె ల్ జడ్పీటీసీ గా పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురికావటంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థుల ఆశలను రేవంత్ భగ్నం చేశారు.ఈ ఎన్నికల్లో రేవంత్ విజయం సాధించడం సంచలనంగా మారింది…

రేవంత్ రాజకీయ ప్రస్థానం ఇలా..

2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనస మండలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు.ఆ తర్వాత చంద్రబాబు ఆహ్వానించటంతో మళ్ళీ టీడీపీ లో చేరారు..2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే గా గెలుపొందారు.2014 లోకూడా ఏపీ విభజన తర్వాత అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండో సారి గెలుపొందారు.టీడీపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహారించారు రేవంత్.2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంలో ఓటుకు నోటు కేసులో ఏసీబీ రేవంత్ రెడ్డి ని 45 రోజుల పాటు జైల్ లో పెట్టింది…

2017లో రేవంత్ టీడీపీ కి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళి తన అనుయాయులతో రాహుల్ సమక్షం లో కాంగ్రెస్ లో చేరారు.మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ ను గమనించిన కాంగ్రెస్ పార్టీ 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లో ఒక్కరిగా రేవంత్ ను కూడా నియమించింది.2018లో కొడంగల్ ఎమ్మెల్యే గా ఓటమిచెందిన రేవంత్ అదే సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ గా గెలుపొంది తన ఉనికిని చాటు కున్నారు…ఇలా కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్థానం సాగిస్తూ 2021 లో తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. జూనియర్,సీనియర్ నాయకులని సమన్వయం చేసుకుంటూ…బలమయిన ప్రతిపక్షం గా బీఆర్ఎస్ పై పలు రాజకీయ విమర్శలు చేస్తూ మాస్ వర్గాలని ఆయన ఆకట్టుకున్నారు. చివరికి తన 20 ఏళ్ల రాజకీయ అనుభవం తో 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కి తగిన స్థానం దక్కేలా కృషిచేసి మరో రాజశేఖర్ రెడ్డి గా పేరు తెచ్చుకున్నారు…

మా ఆయన పట్టు వదలని విక్రమార్కుడు: గీత

మా ఆయన పట్టువదలని విక్రమార్కుడు అంటూ ఆయన భార్య గీత చెప్పారు..తన మనసులో ఏది మంచి అని అనిపిస్తే అది సాధించే దాకా వదలరని గీతా రేవంత్ రెడ్డి చెప్పారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page