శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు
ఢిల్లీ :
అరవింద కేజ్రీవాల్ వారసురాలిగా ఆప్ నాయకురాలు అతిషిని నియామకం అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి నిలువ నున్నారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ తరువాత మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆప్ పార్టీ నుండి అతిషి సీఎంగా పాలన అందించనున్నారు. 1998 నుండి 2013 వరకు 15 సంవత్సరాలు పాటు దీక్షిత్ ఢిల్లీకి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సుష్మా స్వరాజ్ 1998లో 52 రోజులు పాలనందించారు. అయితే..అతిషికి 43 ఏళ్లు కాగా, దీక్షిత్‌కు 60, సుష్మా స్వరాజ్ 46 ఏళ్లలో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతిషి ప్రస్తుతం ఢిల్లీ క్యాబినెట్‌లో అత్యధిక పోర్ట్ ఫోలియోలను కలిగి ఉన్నారు. ఆర్థిక, నీరు, విద్య, పబ్లిక్ వర్క్స్, పవర్, రెవెన్యూ, ప్లానింగ్, సర్వీసెస్, లా, విజిలెన్స్, ఇతర కీలక శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. అరవింద కేజ్రీవాల్ జైలులో ఉన్న కాలంలో అతిషి అటు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారని ఆ పార్టీ సభ్యులు భావించారు. దీంతో శాసన సభా నాయకురాలిగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా..కేజ్రీవాల్‌తో కలసి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కలుసుకున్నారు అతీషి. ఈ సందర్భంగా అతిషికి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ బీజేపీ రాజకీయాలను ఎదుర్కొవాలని ఆయన సూచించారు.
ఢిల్లీ మూడో మహిళా సీఎంగా అతిషి

- Advertisment -