- జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కరీంనగర్, జనతా న్యూస్: సాధారణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కొరకు ఎస్సారార్ కళాశాలలో కావలసిన ఏర్పాట్లను ముందుగానే సమకూర్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి అధికారులకు సూచించారు. గురువారం ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అసెంబ్లి ఎన్నికల కౌoటింగ్ కొరకు చేపట్టిన ఏర్పాట్లను సిపి అభిషేక్ మొహంతి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కళాశాలలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తూ, నవంబర్ 30న పోలింగ్ పూర్తిచేసుకొని, డిసెంబర్ 3న నిర్వహించనున్న కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, చోప్పదండి నియోజక వర్గాల కౌంటింగ్ కొరకు ముందుగానే ఎర్పాట్లను సమీక్షించుకోవాలని, ప్రతి నియోజక వర్గానికి చెందిన ఎంట్రి, ఎగ్జిట్ లను వేరువెరుగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రంలో సిసి కెమరాలు ఏర్పాటు చేయాలని, గత ఎన్నికలలో అనుభవాల దృష్యా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సిపి, డిఈఓ లు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలొ సిపి అభిషేక్ మొహంతి, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఎసిపి ప్రతాప్, రెవిన్యూ ఇతర పోలీసు అధికారులు పాల్గోన్నారు.