కౌశిక్ రెడ్డి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్
శాంతి భద్రతలపై కాంగ్రెస్ సర్కారు సీరియస్
హైదరాబాద్ :
శాంతి భద్రతల విషయంలో పార్టీలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయనడానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కేసు నమోదే ఇందుకు నిదర్శనం. బీఆర్‌ఎస్ నుండి దూరమై కాంగ్రెస్‌కు దగ్గరైన గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం విశేషం. ఆయనతో పాటు కుమారుడు, సోదరుడు, ఇద్దరు కార్పోరేటర్లపై కేసు నమోదైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర ఆరోపనలు`ప్రత్యారోపనలు..బాహాబాహీకి దిగిన నేపథ్యంలో కేసు నమోదు కావడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు

- Advertisment -