జనతా న్యూస్ బెజ్జంకి : మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా? నేనా? అనే రీతిలో సాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేయడంతో గ్రామంలో ఒక్కసారి రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. చేసిన సంక్షేమాన్ని చెప్పుకుంటూ, అభివృద్ధిని వివరించుకుంటూ బీఆర్ఎస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి నాయకత్వంలో బెజ్జంకి మండల అధికార ప్రతినిధి జనగం శంకర్, మాజీ ఎంపిటిసి మామిడాల జయరాం, మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్, సీనియర్ నాయకులు సోమరాంరెడ్డి పర్యవేక్షణలో ప్రచార కార్యక్రమం ఊపందుకుంది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తూ మోజు బ్రహ్మచారి, వెంకటాచారి, కొరివి లక్ష్మణ్, నూనె రాజేందర్,కొరివి కనకయ్య, కొరివి మల్లయ్య, అన్నాజి ముత్యం , బుర్ర రవి గౌడ్, పున్నం రాజేశం, బుర్ర శంకర్ గౌడ్, గొడుగు నారాయణ, బెజ్జంకి నారాయణ, యువజన కాంగ్రెస్ నాయకులు పోతు రెడ్డి మధుసూదన్ రెడ్డి, శీలం నర్సయ్య, బుర్ర తిరుపతి గౌడ్, ఎల హరీష్, కొరివి సంతోష్, పత్రి శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో బేగంపేట గ్రామ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు ఐల పాపయ్య పర్యవేక్షణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ బేగంపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుకుంటూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. బేగంపేట ఉపసర్పంచ్ జంగిటి శ్రీనివాస్ రెడ్డి, బెజ్జంకి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజ్జంకి శంకర్, సీనియర్ నాయకులు గొడుగు రాజయ్య, గొడుగు కనకయ్య, బండి శ్రీనివాస్, యువ నాయకులు కొరివి తిరుపతి, కొరివి శ్రీనివాస్, జనగాం కుమార్, జనగాం శ్రీకాంత్, బెజ్జంకి సతీష్, అన్నాజి చిన్న, కిరణ్, నాగ సముద్రాల సంతోష్, ఒడ్డే చంద్రయ్య, పత్రి రవి, గొడుగు తిరుపతి, మంకాల పోచమాలు తదితరులు పాల్గొన్నారు.