Aravind Kezriwal: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం వర్చువల్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ చేసిన ఫిర్యాదు పై ఇటీవల కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున శనివారం విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ సహకరించడం లేదంటూ హౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ ఆరుసార్లు సమర్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19 విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అంతకు ముందు ఐదు సార్లు విచారణకు పిలువగా సీఎం గైర్హాజరయ్యారు. ఏప్రిల్ లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ డి నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి.
Aravind Kezriwal: వర్చువల్ ద్వారా విచారణకు కేజ్రీవాల్
- Advertisment -