బెజ్జంకి, జనతా న్యూస్: మానకొండూర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాలు జరిగాయి. నియోజకవర్గంలోని బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన లింగాల శ్రీనివాస్ ను మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా బేగంపేట గ్రామానికి చెందిన బర్ల శంకర్ ను బుధవారం నియమిస్తూ నియామక పత్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టతను పెంపొందించాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పదవులకు నియమితులైన లింగాల శ్రీనివాస్, బర్ల శంకర్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.