జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బోనగిరి తిరుపతిని బెజ్జంకి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, మరియు బోనగిరి మహేష్ ని బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శిగా ఆదివారం మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోనగిరి తిరుపతి మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో రసమయి బాలకిషన్ గెలుపు కోసం కృషి చేస్తానని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను చైతన్య పరుస్తూ కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే తన నియమాకానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డికి, సర్పంచ్ తిరుపతిరెడ్డికి, మాజీ ఎంపీటీసీ తిరుపతి రెడ్డికి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్ కు, నాయకులు ముక్కిస రాజిరెడ్డి, తాడూరి రాజిరెడ్డి, మడుపు బాపిరెడ్డి, యువ నాయకులు లింగాల అర్జున్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బీఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షుడి నియామకం
- Advertisment -