-షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. నాగైలేశ్వర్
పెద్దపల్లి,జనత న్యూస్: 2024-25 విద్యా సంవత్సరానికి షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్పోరేట్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. నాగైలేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చిలో 10వ తరగతి పరీక్షలలో 7.0 జీపీఏ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ,ఎస్టీ, బీసీ,ఈబీసీ, మైనార్టీ, డిజేబుల్డ్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in లో మే 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ, ఎయిడెడ్,ఆశ్రమ,ప్రభుత్వవసతి గృహాలు,కేజీవీబీ పాఠశాలలు,ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, నవోదయ,ఆదర్శ పాఠశాలలు,కేంద్రీయ విద్యాలయాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులని, అర్హత కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు తప్పనిసరిగా గడిచిన ఏడు సంవత్సరముల స్టడీ సర్టిఫికెట్స్, మీ సేవా నుండి పొందిన కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము,10వ తరగతి మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకము నందు ఉత్తీర్ణులైన విద్యార్థులు సీబీయస్ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుని ఎస్.ఎస్.సీ.,ఇతర వివరాలను కార్యాలయం పని దినాలలో సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనం లోని జిల్లా షెడ్యూల్డు కులాల అభివృధ్ధి అధికారి కార్యాలయం,పెద్దపల్లి నందు సంప్రదించి ఆన్లైన్లో(ఈ-పాస్ వెబ్సైట్) వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.