హైదరాబాద్ :
మంత్రి కొండ సురేఖపై తగ్గేలే ! అంటున్నారు అక్కినేని నాగార్జున. అమె క్షమాపన చెప్పినా రూ. వంద కోట్ల పరువు నష్ట దావా వేసి తీరుతానని ఆయన స్ఫష్టం చేశారు. సినీ పరిశ్రమ మొత్తం తనకు అండగా నిలిచిందని, ఇక తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్ఫష్టం చేశారు. సమంతకు క్షమాపన చపితే సరిపోతుందా, తన కుటుంబ పరిస్థితేంటని ప్రశ్నించారు. ఇప్పుడు తన కుటుంబానికి క్షమాపన చెప్పినా వదిలిపెట్టబోనన్నారు. కేటీఆర్ విషయంతో అక్కినేని నాగార్జున, సమంత, నాగచైతన్యలపై రాష్ట్ర మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దూమారం రేపాయి. దీంతో కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు అక్కినేని నాగార్జున. అయితే..ఈ కేసు సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
క్షమాపనలు చెప్పినా..తగ్గేదేలే !

- Advertisment -