ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఈనెల 13న పోలింగ్ రోజుతో పాటు 14, 15వ తేదీల్లో రాష్ట్రంలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, చంద్రగిరి, మాచర్ల తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న ఘటనలపై వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరుకావాలని ఇప్పటికే ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మరో ఇద్దరి కమిషన్ల ముందు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో పోలీసులు అధికారులు మార్చడం వల్ల ఈ సమస్య వచ్చిందని వారు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా పోలీసు అధికారులకు స్థానికంగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలపై అవగాహన లేదని, దీంతో వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు కంట్రోల్ చేయడంలో కొంత ఆలస్యం అయిన ట్లు వివరించారు.
ఎలక్షన్ కమిషన్ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
- Advertisment -