విజయవాడ, జనత న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో ప్రకటన చేయడంపై నిరసిస్తూ, దీనిని రద్దు చేసి మెగా డీఎస్సీ ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ‘చలో సెక్రెటేరియట్’ అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విజయవాడ నుంచి పాదయాత్రతో సెక్రెటేరియట్బ కు బయలుదేరారు. అయితే మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకొని వెనక్కి వెళ్ళమని చెప్పారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. షర్మిలను అరెస్టు చేసే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట సాగింది. దీంతో కొండవీటి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రమంలో సీఎం జగన్ పై షర్మిల ఫైర్ అయ్యారు. ఈరోజు జరిగిన సంఘటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, విజయమ్మ కూడా ఈ సంఘటన గురించి బాధపడుతున్నారని, తన పోరాటం నిరుద్యోగుల కోసమేనని అన్నారు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అరెస్ట్..
- Advertisment -