విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం బుధవారం 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ఉదయం 11.03 నిమిషాలకు అసెంబ్లీలో రూ.2,86,389 కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యాయం రూ.30,530 కోట్లు, ద్రవ్య లోటు రూ.55,817 కోట్లు, రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లుగా ఉంది. జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56 శాాతం, జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా ఉంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బడ్జెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను సంపన్న, సంక్షేమ రాష్ట్రంగా మార్చామన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పోలీస్ స్టేషన్లను నిర్మించామన్నారు మానవ మూలధన అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. కాగా శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతారు.
Ap Budjet 2024-25: ఏపీ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు
- Advertisment -