విజయవాడ, జనతా న్యూస్: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల నగగా మోగింది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోను అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఇక్కడ ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్ సభ స్థానాలకు ఓకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ల విషయానికొస్తే..
ఏపీ వ్యాప్తంగా మొత్తం 4 కోట్ల 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్లకు పైగా ఉన్నారు. మహిళా ఓటర్లు 2.07 కోట్లు ఉన్నారు. థర్డ్ జెండర్ 3,482 ఉండగా.. సర్వీస్ ఓటర్లు 67,432.. ఎన్నారై 7,603 ఓటర్లు ఉన్నారు. మహిళలతో ప్రత్యేకంగా 178 పోలింగ్ స్టేషన్లు నిర్వహించనున్నారు. యువతతో 50 పోలింగ్ స్టేషన్లు నిర్వహిస్తారు. 555 ఆదర్శ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 14 న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 28న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. మే 13 ఎన్నికల జరగనున్నాయి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.