(యాంసాని శివకుమార్ -ఎడిటర్)
సమకాలిన ప్రపంచంలో ఎన్నో సమస్యలు.. ఎన్నో బాధలు..వీటిని ప్రభుత్వానికి తెలియజేయడానికి వారధిగా పనిచేస్తుంది మీడియా. ప్రజల పక్షాన వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ.. వారితో ఉత్సాహాన్ని నింపుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇదే క్రమంలో ‘జనతా’ ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో జనతా వారికి అండగా ఉంటూ వారి నుంచి సమస్యలను స్వీకరించి ప్రభుత్వానికి,సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది..
అంతేకాకుండా కొందరు రాజకీయ బలంతో అధికారులు ప్రజాపతినిదులు ప్రజల సమస్యలను వినడానికి నిరాకరిస్తుండడమే కాకుండా వారిపై అరాచకాలు సృష్టిస్తున్నారు,వారి బాగోతాలను కూడా ‘జనతా’ బయటపెడుతుంది. జనతాలో పనిచేసే జర్నలిస్టులు మారుమూల సమస్యలను సైతం వెలికి తీస్తన్నారు. అయితే కేవలం రిపోర్టర్లు, సిబ్బంది మాత్రమే కాకుండా ‘జనతా’ను చదివే ప్రతి ఒక్కరూ సమస్యను ఇక్కడ తెలియజేయవచ్చు. పల్లెటూరిలోని వార్డులో ఉన్న సమస్య అయినప్పటికీ మా దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రచురించి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తాం. అందుకే మీకు అండగా ఉండేందకు 7989867251 వాట్సప్ నెంబర్ తో పాటుగా janathadaily@gmail.com ద్వారా అందుబాటులో ఉంటాం.
మీరు పంపించే సమస్యలకు సరేనా ఆధారాలతో పంపిస్తే వీలైనంత వరకు నిజా నిజాలను తెలుసుకొని వాటిని ప్రచురిస్తాం. అంతేకాకుండా మీ ప్రాంతంలో ఏదయినా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా మా దృష్టికి తీసుకు వస్తే వాటిని బట్ట బయలు చేస్తాం ,మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి . ఈ నెంబర్ కు మీ సమస్యలు చెప్పడం ద్వారా ఇక్కడ ప్రచురించి ప్రభుత్వానికి తెలియజేస్తాం.. ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేస్తూ ప్రజలతోనే ఉంటూ వారికి అండగా ఉంటున్న ‘జనతా’ను మరింత మంది ఆదరిస్తారని కోరుకుంటున్నాం.