లెబనాన్`ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఇజ్రాయిల్ దాడికి లెబనాన్‌లోని పౌరులు పిట్టల్లా నేర రాలుతున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఈ మూడు రోజుల్లోనే 550 మందికి పైగా మృతి చెందగా, 1800 మందికి పైగా గాయపడ్డట్లు లెబనాన్ ప్రభుత్వ శాఖ ప్రకటించడం తీవ్ర కలవర పెడుతుంది. హిజ్జుల్లా సీనియర్ కమాండర్ లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్ర తరం చేస్తున్నట్లు ఇజ్రాయిల్ తెలుస్తుంది. లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షణాన వైమానిక దాడులు చేస్తుండడంతో లెబనాన్ ఖాళీ అవుతోంది. ఇరాన్ మద్దతు కలిగి ఉండటంతోనే హిజ్జుల్లాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మారణ హోమం మరింత పెరిగ నున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి గమనించ వచ్చు.
బెంబెలెత్తుతున్న లెబనాన్ జనం..

- Advertisment -