- పే జల్ సర్వేక్షన్ లో మరో జాతీయ స్థాయి అవార్డు.
- మార్చి 5 వ తేదీన అవార్డు స్వీకరణకు మేయర్ యాదగిరి సునీల్ రావు కు న్యూ డిల్లీకి రావాలని ఆహ్వానం పంపిన ప్రభుత్వం.
- ఈ అవార్డుతో దేశ స్తాయిలో 3 రాష్ట్ర స్థాయి లో 3 మొత్తం 6 అవార్డు లు దక్కించుకున్న కరీంనగర్ నగరపాలక సంస్థ.
- కరీంనగర్ నగరపాలక సంస్థ అవార్డులు రావడం మా పాలకవర్గం పనితీరుకు నిదర్శనం: మేయర్ యాదగిరి సునీల్ రావు.
కరీంనగర్, జనతాన్యూస్: జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ అవార్డులు ప్రకటించినా…. కరీంనగర్ నగరపాలక సంస్థకు అవార్డు రావడం మా పాలకవర్గం పని తీరుకు నిదర్శనం అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. పే జల్ సర్వేక్షన్ లో మరో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణం అని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఖాతాలో మరో జాతీయ స్థాయి అవార్డు చేరింది. ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో బాగంగా గతంలో దేశ స్థాయి లో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ కు మరో పే జల్ సర్వేక్షన్ అవార్డును ప్రకటించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హౌజింగ్ ఆండ్ అర్బన్ ఎఫ్పైర్స్ శాఖా ఈ అవార్డు స్వీకరణకు మేయర్ యాదగిరి సునీల్ రావు కు ఆహ్వానం అందించింది. న్యూ డిల్లీలో మార్చి 5 వ తేదీన ఈ అవార్డును మేయర్ కు అందించనుంది. ఇప్పటికే గతంలోనే జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో కలిపి 5 అవార్డులు రాగా పే జల్ సర్వేక్షన్ అవార్డుతో నగరపాలక సంస్థ ఖాతాలో మరో అవార్డు చేరి మొత్తం 6 అవార్డులు దక్కించుకుంది.
ఇప్పటికే మెరుగైన స్వచ్చ్ సర్వేక్షన్ ర్యాంకులతో పాటు సఫాయి మిత్ర సురక్షా చాలేంజ్ 4 కోట్ల నగదు అవార్డు, వాటర్ ప్లెస్ అవార్డు, 3 హరితహారం అవార్డు రాగా మరో పే జల్ సర్వేక్షన్ అవార్డు కూడ దక్కించుకుంది. గతంలో నగరపాలక సంస్థ పరిదిలో ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పార్కులు, జంక్షన్ల సుందరీకరణ, డివైడర్స్ అభివృద్ధి, మెరుగైన పారిశుధ్యం, ప్రజలకు కలుపించిన జీవన ప్రమాణాలు, ప్రజలకు అందిస్తున్న ప్రతి రోజు మంచి నీరు మరియు త్వరలో అందించ బోయే 24 గంటల మంచి నీటి సరఫరా లాంటి పారామీటర్స్ అంశాల పై ప్రత్యక బృందం నగరంలో సర్వే చేసి పే జల్ సర్వేక్షన్ అవార్డు కు కరీంనగర్ ను ఎంపిక చేసింది. మన రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… కరీంనగర్ నగరపాలక సంస్థ అవార్డు ల పంట పండటం మా పాలకవర్గం పనితీరుకు నిదర్శనం అన్నారు. చిత్తశుద్ధితో పారదర్శకంగా ప్రజలకు మా పాలకవర్గం ఎన్నో సేవలు అందిస్తుందన్నారు. గతంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మా పాలకవర్గం ప్రజలక కష్టాలను తొలగించేందుకు వందల కోట్లు తెచ్చి నగరాన్ని సుంధరనగరంగా మార్చిందన్నారు.
పెద్దలు వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారం తో నగరపాలక సంస్థ పరిదిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు రేటును పెంచామన్నారు. నగరంలో సుందరమైన రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు డివైడర్లను నిర్మాణం చేసి పార్కులు, జంక్షన్లను సుంధరంగా తీర్చిదిద్దామన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి… నగరాన్ని సుంధరంగా మార్చామని తెలిపారు. గతంలో త్రాగు నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డ ప్రజలకు ప్రస్తుతం ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేస్తూ… విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పాయిలెట్ ప్రాజెక్ట కింద హౌజింగ్ రిజర్వాయర్ పరిదిలో 5 వేల కనెక్షన్లకు 24 గంటల మంచి నీటిని సరఫరా చేస్తామని దాన్ని దశలవారీగా నగర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. హరితహారం లో బాగంగా లక్షల మొక్కలు నాటి నగరానికి పచ్చదనాన్ని పెంచామన్నారు.
మెరుగైన పారిశుధ్య నిర్వహణ తో పాటు మురుగు నీటిని శుద్దీకరణ చేస్తూ…. వాటర్ ప్లెస్ హోదాను కూడ దక్కించుకున్నామని తెలిపారు. గతంలోనే సఫాయి మిత్ర సురక్షా చాలేంజ్ లో 4 కోట్ల నగదు బహుమతిని కూడ నగరపాలక సంస్థ దక్కించుకుందని తెలిపారు. మరో పే జల్ సర్వేక్షన్ అవార్డు కూడ నగరపాలక సంస్థ కు రావడం మా పాలక వర్గానికి చాలా గర్వకారణం అన్నారు. త్వరలోనే నగరపాలక సంస్థ 24 గంటలు నీటి సరఫరా చేసే మొట్ట మొదటి నగరంగా త్వరలోనే పేరు సంపాదించుకో బోతుందని అన్నారు. నగరపాలక సంస్థ కు వచ్చే అవార్డులు ఇంకా మా పై బాధ్యతను పెంచుతున్నాయని… అవార్డు రావడంలో కృషి చేస్తున్న నగర ప్రజలకు, అధికార సిబ్బంది కి, మరియు మా పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.