కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ శ్రీకారం
మహాళా ఆరోగ్యంపై సరికొత్త కార్యక్రమం
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా లోని అంగన్ వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, ఇతర విద్యాధికారులతో కలసి శుక్రవారం ప్రారంభించారు. ఆరోగ్యం, భద్రతపై మహిళలతో కలెక్టర్‌చర్చించి..పరిష్కారా మార్గాలను వివరించారు. ప్రభుత్వ విద్య, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య బోధనాసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, అర్భన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను వివరించారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని, గర్భిణులు పూర్తి స్థాయిలో సాకారం అందించాలని కోరారు. అప్పులు చేసి ప్రయివేటు ఆసుపత్రులకెళ్లి, డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. అందరూ తమ ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమాజంలో నెలకొన్న వివిధ రుగ్మతల నిర్మూలనకు శుక్రవారం సభ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎంపీడీఓ ప్రభు, సీడీపీఓ ఉమారాణి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్, మహిళా శక్తి కో ఆర్డినేటర్ శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, సూపర్ వైజర్ అరుణ పాల్గొన్నారు.