Andhrapradesh : ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి ఒక్కొక్కరు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీకి చేరారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి మారేందుకు రెడీ అయ్యారు. ఈమేరకు ఆయన త్వరలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆలూరు నియోజకవర్గానికి చెందిన జయసైతం వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆదివారం రాప్తాడు నిర్వహించిన సీఎం సభకు రాకపోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.
Andhrapradesh : వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల షాక్.. త్వరలో టీడీపీలోకి..
- Advertisment -