Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా బుధవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాగుంట రాజీనామాతో ఇప్పటి వరకు వైసీపీ నుంచి 6గురు ఎంపీలు రాజీనామా చేసిటనట్లయింది. వీరిలో ఐదుగురు లోక్ సభ ఎంపీలు ఉండగా.. ఒకరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు. వీరిలో వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణ దేవరాయులు, రఘురామకృష్ణ రాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు పార్టీని వీడడం కలకలం రేపినట్లయింది. అయితే వీరిలో ఇప్పటి వరకు కొందరు టీడీపీ సేలో జాయిన్ అయ్యారు. మిగతా వారు ఇంకా కార్యచరణను ప్రకటించలేదు.
Andhrapradesh: వైసీపీలో కలకలం.. భారీగా నేతల రాజీనామాలు
- Advertisment -