Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. శుక్రవారం ఉదయం ఉత్సవాల్లో భాగంగా స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. ఈరోజు సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజ పటం ఆవిష్కరణ చేయనుున్నారు. శుక్రవారం నుంచి మార్చి 11 వరకు బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి. శనివారం నుంచి స్వామి అమ్మవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వదర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శన మాత్రమే ఉంటుందన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఘనంగా చేశారు.
Andhrapradesh: శ్రీశైలం : బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- Advertisment -