ఉత్సాహంగా విద్యార్థులు, యువకుల ప్లాష్‌మాబ్
ఆకర్షనీయంగా జిల్లా కలెక్టర్, అధికారులు
కరీంనగర్-జనత న్యూస్
వ్యాయామంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో హాఫ్ మారతాన్ నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ సైక్లిస్టు అసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యాంతం ఆకట్టుకుంది. నగరంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పలు ముఖ్య కూడళ్లలో విద్యార్థులు, యువత ప్లాష్‌మాబ్‌తో ఆకట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తన బాబుతో, ఇతర అధికారులు తమ పిల్లలతో ఈ మారథాన్‌లో పాల్గొని ఆకర్శనగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఆధునిక జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకో గంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలని ప్రజలను కోరారు. నిత్యం రన్నింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతామని.. ప్రతి ఒక్కరూ కనీసం నిత్యం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు. నగరవాసులకు ఫిట్ నెస్ పై అవగాహన కల్పించేందుకు మారథాన్ కార్యక్రమాన్ని 3కె, 5కె, 10కె, 21కె విడతలుగా నిర్వహించినట్లు సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఐవీ స్కూల్ విద్యాసంస్థల అధినేత పసుల మహేష్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చహత్ బాజ్ పాయ్ ,ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కేడెట్లు, ఎన్ సీ సీ తో పాటు ఢల్లీి డిఫెన్స్ అకాడమీ, శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ, వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న హాఫ్ మారథాన్

- Advertisment -