వరంగల్,జనతన్యూస్: మేడారం జాతరలో గురువారం నాడు కీలక ఘట్టం జరిగింది. చిలకగల గుట్ట నుంచి మేడారం గద్దె వరకు అమ్మవారు భక్తజన సందోహం మధ్య బయలు దేరారు. సమ్మక్క దేవత గద్దెకు ఆగమన సమయంలో భక్తులు దారి పొడువునా మొక్కులు, ఎదురుఖోల్లు, కోడిపిల్లను దేవతకు ఎదురుగా ఎగురవేయడం, మేక పోతుల బాలులు, ముగ్గులు వేసి, శివసత్తుల పునకలు,వివిధ రకాల వేషధారణలు దేవత అవహించి దేవత చెప్పినట్లుగా అడ మగ వారు చీర రవిక ధరించి వీరగొల వడి బియ్యం కట్టుకొని,అమ్మవారి ఆవహించుకొని విన్యాసాలు చేస్తూ అమ్మవారికి గౌరవ సూచకంగా భక్తి పరవశంతో స్వాగతం పలికారు, అమ్మవారు వచ్చే దారి పొడవనా తుడుం దెబ్బ, గిరిజన తెగలు, పోలీస్ సిబ్బంది రోప్ పార్టీ, సిబ్బంది మూడు అంచల వలయంగా ఏర్పడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమ్మవారి ఆగమనం కన్నుల పండగుగా కొనసాగింది.దారికి రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు,అమ్మవారు వచ్చే దారిలో వేచియున్నా భక్తులు జై సమ్మక్క సారక్క తల్లీ అంటూ నినాదాలు చేస్తూ భక్తి పరవశంతో ముగినిపోయారు.
for Medaram Special E paper click here
https://epaper.janathadaily.in/view/156/23-02-2024/1