కరీంనగర్, జనతా న్యూస్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అంబటి జ్యోజి రెడ్డి ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గం లోని ప్రతి ఇంటిని కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నాడు. తనను గెలిపిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తానో వివరిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నాడు. ప్రత్యర్థుల యొక్క ఆక్రమాలను ఎత్తిచూపుతూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం సింహం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు.
గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమై సాధారణ జీవితం గడుపుతున్నానని, కరీంనగర్ ప్రజలకు అవకాశం ఇస్తే అన్నింటి అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ముఖ్యంగా మహిళలు, షెడ్యూలు కులాలు, షెడ్యూల్డ్ వర్గాలు, మైనార్టీలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధి తన ధ్యేయంగా ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తూ ఓటర్ ను ప్రత్యక్షంగా కలుస్తూ గెలుపు కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అంబటి జ్యోజి రెడ్డి పేదవారికి కార్పొరేట్ వైద్యం ఉచితం, మహిళలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, రైతులకు గిట్టుబాటు ధర, మత్తుమందులు, మాదకద్రవ్యాలనుంచి కరీంనగర్ యువతను కాపాడుట, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ స్కీం ద్వారా శిక్షణ, వృద్ధులకు, వికలాంగులకు అన్ని వసతులతో కూడి న ఆశ్రమాల ఏర్పాటు వంటి వాగ్దానాలు ఇస్తున్నాడు.