Tuesday, July 1, 2025

ఎంపీ ఎన్నికలకు ఒంటరిగానే పోటీ..

  • తెలంగాణలో వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ
  • ఎమ్మెల్యేల సంఖ్య, ఓటింగ్‌ షేర్‌ పెరగడంతో క్యాడర్‌లో నూతనోత్సాహం
(యాంసాని శివకుమార్)

అప్పుడో లెక్క..ఇప్పుడో లెక్క. పరిస్థితులు మారాయి. కాలం మారింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలే తమకు అద్భుత ఫలితాలు ఇచ్చాయంటున్నారు బీజేపీ నేతలు. ఇక త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ ఎంపీ సీట్లను గెల్చుకుంటామని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎలక్షన్స్ కు చాలా డిఫరెంట్ అంటున్నారు. నిజంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుందా ? పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడంతోనే సీట్లు పెరిగాయా అంటే కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్. మరి అది ఎలా సాధ్యం అవుతుంది. రిజల్ట్స్ తర్వాత రివ్యూ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

  • సెటిలర్స్ ఓట్లు గంపగుత్తగా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగింది బీజేపీ. పవన్ సినీ గ్లామర్ బాగా కలిసొస్తుందని భావించారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఎక్కువగా ఆశల పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా గాజు గ్లాసు పార్టీకి 8 సీట్లను కేటాయించారు. ఇంకేముంది 111 చోట్ల కమలం క్యాండిడేట్సే బరిలోకి దిగారు. బీజేపీకి బండి సంజయ్ ఇచ్చిన బూస్ట్ తో మెజార్టీ సీట్లుు గెలవొచ్చని కలలు కన్నారు. మోదీ మేనియా, పవన్ ఇమేజ్ బాగా వర్కవుట్ అవుతుందని భావించారు. సెటిలర్స్ ఓట్లు గంపగుత్తగా బీజేపీకే పడతాయని ఆశపడ్డారు. సీన్ కట్ చేస్తే ఫలితాల్లో అన్నీ రివర్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడంతో బీజేపీకి మేలు చేయకపోగా..డ్యామేజే ఎక్కువ జరిగిందని అర్థమైంది. ఇక అంతే వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది బీజేపీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని అనౌన్స్ చేసేశారు కిషన్ రెడ్డి. ఇక్కడ ఓకే …మరి ఏపీలో పరిస్థితి ఏంటనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లోకి పెట్టేశారు.

  •  జనసేనకు కనీసం డిపాజిట్లు కూడా..

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్ డమ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా..ఏం చేసినా జనం తండోపతండాలుగా తరలివస్తారు. వాటిని ఓట్లుగా మల్చుకోలేకపోవడంలో ఫెయిల్ అవుతున్నారు. బీజేపీ అత్యుత్సాహం చూపించి పవన్ తో పొత్తు పెట్టుకుంది. కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయించింది. అయితే పవన్ ప్రచారం చేసిన సెగ్మెంట్స్ లో బీజేపీకి ఓట్లు పడకపోగా… సెటిలర్స్ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడ్డాయి. ఆయా నియోజకవర్గాల్లో కనీసం జనసేనకు డిపాజిట్లు రాలేదు. కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్కకు ఉన్న ఇమేజ్ కూడా పవన్ కు రాజకీయంగా లేదని బీజేపీ భావిస్తోంది. ఆమెకు వచ్చిన ఓట్లు కూడా జనసేన తరపున పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థి సాధించలేకపోయారు. దీంతో కమలం నేతలు డైలమాలో పడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పవన్ తో కలిసి వెళితే జరగబోయే నష్టం తీవ్రంగా ఉంటుందని భావించే..తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కిషన్ రెడ్డి తేల్చేశారు.

  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీ..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఫర్ ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాండిడేట్స్ కు గట్టి పోటీ ఇచ్చారు. మరికొన్ని సెగ్మెంట్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే వాళ్లమన్న నమ్మకం ఏర్పడింది. ఇక ఇదే స్పీడ్ తో ప్రజల తరపున పోరాటం చేస్తే తెలంగాణలో పాగా వేస్తామనే నమ్మకం కలిగింది అధిష్టానికి. అటు ప్రధాని మోదీ నుంచి అమిత్ షా వరకు అందరూ అధికారంలోకి రావడానికి సర్వ శక్తులు ఒడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగను మచ్చిక చేసుకోవడంతో ఆ వర్గం ఓట్లు కూడా అదనంగా యాడ్ అయినట్టు తెలుస్తోంది. ఎలాగూ బీజేపీ సంప్రదాయ హిందూ ఓటు బ్యాంకింగ్ ఉంది. ఇక మాదిగలు కలిస్తే గెలుపు ఈజీ అవుతుందనే భావిస్తున్నారు.

  • సీట్లే కాదు..ఓటు షేరింగ్ కూడా..

.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు 4 ఎంపీ సీట్లను దక్కించుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిని గోషామహల్ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. మిగతా చోట్ల ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారి రూటే కాదు.. గేర్ మార్చేశారు కమలం నేతలు. సీట్లే కాదు..ఓటు షేరింగ్ కూడా అమాంతం పెరిగింది. జనసేనతో పొత్తును బీజేపీ క్షేత్రస్థాయి క్యాడర్ కొంత వ్యతిరేకించింది. పవన్‌తో పొత్తుతో నష్టం జరగలేదనే మరికొందరు నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జనసేనతో పొత్తు బీజేపీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగిందని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. జనసేన కంటే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎలా బేరేజు వేసుకుంటారనే విషయాన్ని అధిష్టానం పెద్దలకే వదిలేశారు.

  • జ‌న‌సేన‌తో పొత్తు రాజ‌కీయ తప్పిదం..

త్వరలో జరగనున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తుంద‌నే ప్ర‌చారంపై కిష‌న్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల‌కు త‌మ పార్టీ స‌మాన దూరం పాటిస్తుంద‌న్నారు. బీజేపీ ఒంట‌రిగా పోటీ చేసి స‌త్తా చాటుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీల‌కంటే ఎక్కువ పార్ల‌మెంట్ స్థానాల‌ను తాము సాధిస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం రాజ‌కీయంగా త‌ప్పిద‌మ‌ని బీజేపీకి జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. జ‌న‌సేన‌కు ఒక సిద్ధాంతం, విధానం లేద‌ని, అలాగే ప‌వ‌న్‌కు నిల‌క‌డ లేద‌ని బీజేపీ నేత‌లు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా తెలంగాణ‌లో బీజేపీకి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

  • తెలంగాణలో ఇంకా సెంటిమెంట్

తెలంగాణలో జనసేనకు భారీ డ్యామేజీ జరిగింది. దాని ఎపెక్ట్ ఏపీలోనూ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయన్నారు. అక్కడ పవన్ కు ఉన్న ఇమేజ్ ను ఓట్ల రూపంలో క్యాష్ చేసుకుంటారనే చెబుతున్నారు. తెలంగాణలో ఇంకా సెంటిమెంట్ ఉండటం..ఆంధ్రా పాలకుల పెత్తనాన్ని సహించలేకనే పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో ఓట్ల రూపంలో మల్చుకోలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.

  • ఒంట‌రిగానే బ‌రిలో..

ఎటూ గెల‌వ‌లేమ‌నే ఉద్దేశంతోనే ఏ మాత్రం బ‌లం లేని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నార‌నే ప్ర‌తికూల ప్ర‌చారం ఎన్నిక‌ల్లో బీజేపీని దెబ్బ‌తీసిన‌ట్టు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. అందుకే రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో సంబంధం లేకుండా ఒంట‌రిగానే బ‌రిలో దిగాల‌ని తెలంగాణ బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. బ‌హుశా ఇదే ఫార్ములా ఏపీలోనూ అమలు చేస్తుందో లేదో  చూడాలి

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page