ఇల్లంతకుంట జనతా న్యూస్ ప్రతి ఒక్కరూ విధిగా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలందరూ సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు తెలియజేశారు. శనివారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట,రెపాక గ్రామాల్లో ప్రజలతో సమావేశమై ఈ నెల 13 వ తేదీన జరుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కల్పించారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలింగ్ స్టేషన్ సమీపంలో గుంపులు గుంపులుగా ఉండకూడదని .ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఇంటికి వెళ్లకుండా పోలింగ్ స్టేషన్ల వద్ద తిరుగుతూ కనిపిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలింగ్ స్టేషన్లలోకి ఎవరూ మొబైల్ ఫోన్ తీసుకపోకూడదని, సోషల్ మీడియా వేదికగా విద్వేషాపూరిత ,రెచ్చగొట్టే సందేశాలు పంపుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తారని తెలిపారు.
ప్రజలందరూ విధిగా ఎన్నికల నిబంధనలు పాటించాలి
- Advertisment -