అభినందించిన ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి
కరీంనగర్-జనత న్యూస్
ఇటీవల సిలవర్ జోన్ వారు నిర్వహించిన అంతర్జాతీయ ఇన్ఫార్మెటిక్స్ పోటీ పరీక్షల్లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ`టెక్నో స్కూల్ విద్యార్థులు బంగారు, రజత పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో విజేతల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. పాఠశాలలోని వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు జోయల్దేవిన్, క్రిష్ణచైతన్య శ్రీ, మనీష్, అనిరుద్, వర్షిత్ సాయి, పి. శ్లోక, టి. సర్వేశ్, ధ్రువ్ శర్మ, వి. అభిరామ్, క్రిష్ణప్రతీక్ రెడ్డి, యం. ఓంతేజ లకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందన తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే మరిన్ని పోటీల్లో ఉత్యుత్తమ ప్రతిభ కనబర్చుతారని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రాథమిక దశ నుండే సమాచార పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని నరేందర్ రెడ్డి సూచించారు. విద్యార్థులకు తరగతి గదుల్లో ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తామని,అన్ని విషయాలు తెలియ జేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.