యూనివర్సల్ ఐకాన్ ఆచీవర్ ఆవార్డ్
కరీంనగర్-జనత న్యూస్
అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డికి ప్రతిష్టాత్మక యూనివర్సల్ ఐకాన్ అలీవర్ అవార్డు`2024 ప్రకటించారు. కరీంనగర్ లోని అల్ఫోర్స్ ఇ`టెక్నో స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నరేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం చాలా ముఖ్యమైందని తద్వారా ఖ్యాతి గడిరచ వచ్చని పేర్కొన్నారు. గత 34 సంవత్సరాలుగా అల్ఫోర్స్ విద్యా సంస్థ తెలంగాణ విద్యరంగంలో అనేక పెనుమార్పులు తీసుక రావడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభవంతులుగా తీర్చి దిద్దిందని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని విద్యనందిస్తూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి ప్రణాళికలతో విద్యనందిస్తున్నందుకు యూఏఈకి చెందిన జెనటిక్స్ అల్టిమా వారు యూనివర్శల్ ఐకాన్ ఆచీవర్ ఆవార్డ్ 2024ను ప్రకటించి ప్రతినిధి ద్వారా పంపించారని చెప్పారు. ఈ ఆవార్డు రావడానికి కృషి చేసిన పరిపాలన విభాగం వారికి, ప్రిన్సిపల్స్‌కు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆవార్డు రావడం పట్ల విద్యసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నరేందర్ రెడ్డిని అభినందించారు.
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి..

- Advertisment -