కరీంనగర్-జనత న్యూస్
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి రాష్ట్ర రెడ్డి జేఏసీ మద్దతు ప్రకటించింది. కరీంనగర్‌లో జేఏసీ ప్రతినిధులు ఏ రాంరెడ్డి, పి.రాంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, చుక్కారెడ్డి తదితరులు వారిని కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నేడు తెలంగాణలోని విద్యారంగం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, విద్యార్థులకు తక్కువ ఫీజులో నాణ్యతమైన విద్యనందిస్తూ అగ్రగామిగా కొనసాగుతుండడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఒక గొప్ప విద్యావేత్త, సౌమ్యశీలుడైన నరేందర్ రెడ్డిని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజార్టితో గెలిపించి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామని భరోస ఇచ్చారు. డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యావేత్తగా, ఈ రంగంలో పూర్తిగా అవగాహన కలవాడినని, పట్టభద్రుల సమస్యలు తెలిసిన తనని ఎమ్మెల్సీ గా గెలిపించాలని కోరారు. పట్టభధ్రులకు అన్ని విషయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ నియమకాల్లో ప్రాధాన్యం కలిపించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, కరీంనగర్ రెడ్డి జేఏసీ సభ్యులు పాల్గోన్నారు.
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి రాష్ట్ర రెడ్డి జేఏసీ మద్దతు

- Advertisment -