Thursday, September 19, 2024

అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డి దూకుడు

గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ..ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ..

కరీంనగర్‌-జనత న్యూస్‌

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన అల్ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి..ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. నగరంలోని ఆయా గ్రౌండ్స్ లో వాకర్స్ ను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్‌ లోని డాక్టర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో వాకర్స్‌ను ఆయన కలసి మద్దతు కోరారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ఈ సారి తనకు అవకాశం కల్పించాలని యువకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పట్టభద్రుల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. నిరుద్యోగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దుతున్నానని తెలిపారు. 2025 సంవత్సరంలో నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాగా..విద్యరంగ అభివృధ్ధికి కృషి చేస్తూన్న నరేందర్‌ రెడ్డిని పలు వాకర్స్‌ అసోసియేషన్లు ఘనంగా సన్మానించాయి.

ఆధ్యాత్మిక వేడుకల్లో ..
ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి. నగరంలోని గణేశ్‌ నగర్‌, విద్యానగర్‌, సూర్యానగర్‌ ప్రాంతాల్లోని గణేశ్‌ మండపాల్లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవలో ఆయన పాల్గొన్నారు. విఘ్నాలకు అధిపతి గణనాధుడని, ఆ గణేశున్ని ఆరాధించినవారికి ఎన్నో లాభాలుంటాయని తెలిపారు. గణపతి నవరాత్రులు అనగానే సంతోషం, బంధుత్వం, అప్యాయత, సోదరభావం, ఆనందం వెల్లివిరుస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రధమ పూజ్యుని సేవలో తరించి అత్యుత్తమ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. స్వామి వారి విశిష్టత వర్ణింపలేనిదని తెలుపుతూ, ప్రతి నిర్వహకుడు వచ్చే సంవత్సరం నుండైనా మట్టిగణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షులుగా ఉండాలని కోరారు. వచ్చే పట్లభద్రుల ఎంఎల్‌సీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేసి నూతన చరిత్ర సృష్టించాలని కోరుకుంటూ మండపాల నిర్వాహకులు నరేందర్‌ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గణపతి మండపాల నిర్వహకులు, కాలనీవాసులు, అల్ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page