కరీంనగర్-జనత న్యూస్
కళా ప్రదర్శన వల్ల సంతోషంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. కరీంనగర్ లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో ‘అల్పోర్స్ కల్చరల్ ఫీయిష్టా’ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు విధిగా వివిధ కళల పట్ల శ్రద్ద పెట్టాలని, అందులో ప్రతిభ చాటి ఖ్యాతిని గడించాలని సూచించారు. నేటి కాలంలో చాలా మంది సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపడమే కాకుండా, నిత్యం సాధన చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నారని చెప్పారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు, స్నేహ పూర్వక పోటీని ఏర్పరిచేందుకు వివిధ కళా, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కళోత్సవాల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా శుభపరిణామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కేరింతల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు నరేందర్ రెడ్డి. వివధ పరీక్షల్లో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వచ్ఛంధ సంస్థ సభ్యులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు పలు యజమాన్యాలు.. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.