ఎన్నికలు ముగియడంతో పాటు వేసవి సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరితంగా పెరుగుతుంది. ప్రస్తుతం తిరుమల లో దర్శనానికి రెండు రోజుల సమయం పడుతుంది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో సర్వదర్శనానికి 30 నుంచి 41 గంటల సమయం పడుతుంది. రద్దీ పెరిగిన దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ ఉన్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు కూడా అనుమతించమని తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీడీడీకి సహకరించాలని కోరారు.
తిరుమల భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలు రద్దు..
- Advertisment -