జనత న్యూస్ బెజ్జంకి : కరీంనగర్ బస్ డిపో నుండి ఉదయం గుండ్లపల్లి కొండాపూర్ పీచుపల్లి వడ్లూర్ మీదుగా బెజ్జంకి మోడల్ స్కూల్ వరకు మరియు సాయంత్రం కరీంనగర్ బస్ డిపో నుండి గుండ్లపల్లి మీదుగా బెజ్జంకి మోడల్ స్కూల్ ,బేగంపేట, వడ్లూర్, పీచుపల్లి, కొండాపూర్, గుండ్లపల్లి కరీంనగర్ వరకు మోడల్ స్కూల్ బస్సు వేయించుట కొరకు మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కి విన్నవించగా వెంటనే స్పందించి ఆర్. ఎం కరీంనగర్ కి లేఖ ఇవ్వగా ఆ లేఖను మంగళవారం కరీంనగర్ ఆర్.ఎం సూచరిత & డిప్యూటీ ఆర్. ఎం ను కలిసి అట్టి లేఖను వారికి అందించి విద్యార్థిని విద్యార్థుల సౌకర్యం భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే సూచనను గౌరవించి బస్సు నడిపించాలని కోరగా సానుకూలంగా స్పంచించారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది .ఈ కార్యక్రమంలో ఆర్ టి ఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్, జిల్లా అధికార ప్రతినిధి గాదం స్వామి, మైనార్టీ సెల్ అధ్యక్షులు షాదిక్ ,నాయకులు మాంకాల ప్రవీణ్ కుమార్, పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ కు బస్సు వేయండి
- Advertisment -