- కండువా కప్పి సాధరంగా ఆహ్వానించిన సతీష్ కుమార్
హుస్నాబాద్, జనతా న్యూస్: సీనియర్ రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హుస్నాబాద్ ప్రజానీకానికి సుపరిచితుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి తన అనుచరులు 650 మందితో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారికి గులాబీ కండువా కప్పి సతీష్ కుమార్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకుడు, హుస్నాబాద్ ప్రజలకు సుపరిచితుడు ఐలేని మల్లికార్జన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ఆయనకు పార్టీలో సమున్నత స్థానము కల్పిస్తామని తెలిపారు.
- సొంత ఇంటికి వచ్చానన్న మల్లికార్జున్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ చేశాను, ఇప్పుడున్న పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రజల పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ అందుకనే పార్టీలో చేరాను అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న సతీష్ కుమార్ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ఆయన గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు, హుస్నాబాద్ లో సతీష్ కుమార్ గెలుపు చారిత్రాత్మక అవసరమని మల్లికార్జున్ రెడ్డి వ్యాఖ్యానించారు.