విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర నాటికి విశాకు రాబోత్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే పరిపలన కొనసాగిస్తానని, పరిపాలన భాగమంతా ఇక్కడే ఉంటుందని ఆయన ప్రకటించారు. సోమవారం జగన్ విశాఖలో పర్యటించారు. ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో మరింత అభివృద్ది చేస్తుందన్నారు. ఇన్ఫోసిస్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ నాటికి నేను ఇక్కడే ఉండబోతున్నానని సీఎం జగన్ ప్రకటించారు.
డిసెంబర్ నాటికి విశాఖలో పరిపాలన: ఏపీ సీఎం జగన్
- Advertisment -