బెజ్జంకి జనత న్యూస్ : బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ ఆధైర్య పడొద్దని, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండల అద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి అధ్యక్షతన శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకర్గంలో నయాపైసా అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ మోసపూరిత, సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడాలని,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతే కాంగ్రెస్ మాత్రం రాష్ర్టాని ఆగం చేస్తున్నదని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఅర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, బోయినపల్లి శ్రీనివాస్ రావు,ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అద్యక్షులు దుంబల రాజా మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు,మాజీ ఏఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య, సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు, మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,ఎలుక దేవయ్య, దీటి రాజు,వంగల నరేశ్, యువజన అద్యక్షులు బిగుల్ల మోహన్,దీటి బాలనర్సు,పర్శరాములు,తిరుపతి,గ్రామశాఖ అద్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.