రూరల్ పోలీసులను అభినందించిన ఏసీపీ
కరీంనగర్-జనత న్యూస్
చైన్ స్నాచింగ్, ఇతర చోరీలు చేస్తూ పోలీసుల నుండి తప్పించుక తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడిరచారు ఏసీపీ వెంకట రమణ. గత కొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుక తిరుగుతున్న ముగ్గురు నిందితులను ఎంతో చాక చక్యంగా రూరల్ పోలీసులు పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంకు చెందిన ఎడవెల్లి దీపక్, ఇదే గ్రామానికి చెందిన ఎడవెల్లి చందు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకెనపల్లికి చెందిన సింహరాజు నరేశ్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని తెలిపారు. నగరంలోని సీతారాంపూర్, మెహర్ నగర్, నగునూర్, వావిలలపల్లి, గోపాల్ పూర్, జ్యోతినగర్, తీగలగుట్టపల్లి లలో శివారు ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని మోటార్ సైకిల్ పై వచ్చి చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డట్లు తెలిపారు. మంగళవారం ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్స్‌పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లి లోని అమ్మవారి గుడి చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూటీపై వస్తున్న ఇద్దరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని, వారిని తమ పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 105.85 గ్రాముల బంగారమును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, ఏఎస్‌ఐ రాజయ్య, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు రాజయ్య , సల్లా ఉద్దిన్, మీసాల రమేష్ , దయానంద్, కనకయ్య , శీను లను ఏసీపీ అభినందించారు.
చోరీ కేసుల్లో నిందితుల ఆరెస్టు

- Advertisment -