ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్
వసతి గృహం భవనం పై నుండి దూకి ఓ విధ్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అశ్విత అనే 8వ తరగతి విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి క్రిందకి దూకింది. దీనితో, వసతి గృహం సిబ్బంది హటాహుటిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆసుపత్రి సందర్శించి వివారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భముగా విధ్యార్తిని నుండి వివరాలు రాబడుతూ, అలా దూకడం మంచి పద్దతి కాదని, చదువు ఇష్టం లేకపోతే అమ్మా, నాన్నలకు చెపితే వారు చదివిపించక గొర్లో, బర్లో కాసేందుకు పంపుతారు కదా అంటూ సున్నితంగా మందలించారు.