Thursday, September 19, 2024

ఏసీబీకి చిక్కిన అవినీతి జలగలు

రూ. లక్ష లంచం తీసుకుంటూ..
పట్టుబడ్డ డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌ రావు, క్యాషియర్‌
మూడేళ్లుగా రైతును వేదిస్తున్న ఆఫీసర్‌
రిటైర్డ్‌ అయ్యే ముందు కట కటకటాలకు..

కరీంనగర్‌-జనత న్యూస్‌

‘‘ప్రభుత్వాలు మారినా లంచవతారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిదే..ఏ పనీ జరుగదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు ఆఫీసర్లు. డబ్బు కోసం జలగల్లా వ్యవహరిస్తున్నారు. తాజాగా కరీంనగర్‌ డీసీఎంఎస్‌ మేనేజర్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌ రావు చేసిన నిర్వాకమే ఇందుకు ఉదాహరణ. మూడేళ్లుగా లంచం కోసం బాధితున్ని ముప్పు తిప్పలు పెట్టగా..ఇక చివరకు చేసేది లేక ఏసీబీ అధికారులకు పట్టించాల్సి వచ్చింది’’

కరీంనగర్‌ డీసీఎంఎస్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వర్‌ రావు, క్యాషియర్‌ కుమార స్వామి పట్టుబడ్డారు . పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన బాధితుడు రాజు నుండి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా..రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్‌పీ రమణమూర్తి మీడియాకు వివరించారు. 2018-19 నుండి డీసీఎంఎస్‌ ద్వారా గ్రామంలో రాజు ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాడు . ఇందుకు సంబంధించిన 50 శాతం కమీషన్‌ ఇచ్చేందుకు డీసీఎంఎస్‌ మేనేజర్‌ లంచం డిమాండ్‌ చేశాడు. పెండిరగ్‌ డబ్బులకు బదులుగా డీసీఎంఎస్‌ ద్వారా సరఫరా చేసే ఎరువులకు లారీకి లక్ష రూపాయల చొప్పున డిమాండ్‌ చేయడంతో..ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు రాజు. 90 లక్షలకు గాను ఇంకా 69 లక్షలా 29 వేల రూపాయలు బాధితుడు రాజుకు రావాల్సి ఉందని..ఇందుకు బదులుగా 15లారీల ఎరువులకు 15 లక్షలు డిమాండ్‌ వెంకటేశ్వర్‌ రావు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు ఏసీబీ డిఎస్‌పి. ఇందులో భాగంగా ఒక లారీలోడ్‌కు లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌ రావు, క్యాషియర్‌ కుమార స్వామిని ఏబీసీ కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు పంపించనున్నట్లు ఏసీబీ డీఎస్‌పీ తెలిపారు .

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page