Sunday, July 6, 2025

నిర్మల్ జిల్లాలో యువతిపై కత్తితో దాడి.. అక్కడికక్కడే మృతి

నిర్మల్ జిల్లాలో పట్టపగలే దారణం జరిగింది. జిల్లాలోని ఖానాపూర్ పట్టణలో ఓ యువతిని యువకుడు కత్తితో హత్య చేశాడు. ఈ దాడిలో యువతి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన సోనీ అనే యువతి టైలరింగ్ కు వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం ఆమె టైలరింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అతడిని అడ్డుకోబోయిన యువతి వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల బాలుడిపై కూడా యువకుడు దాడి చేశాడు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఈ దాడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page