రాజన్న సిరిసిల్ల, జనత న్యూస్: ఉపాధి హామీ కూలి పనుల్లో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై మట్టి పెట్లలు కూలాయి. ఈ ప్రమాదంలో మారుపాక రాజవ్వ అనే మహిళ మృతి చెందారు. పల్లం దేవయ్య ,పల్లం రాజవ్వతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి.
‘ఉపాధిహామీ’ పనుల్లో మట్టిపెల్లలు కూలి మహిళ మృతి
- Advertisment -